telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం: నారా లోకేష్

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ నకు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం తెలిపారు.

అమరావతి వర్క్ షాప్-2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు.

దేశంలో ఓ కీలక మలుపు కానుందిని లోకేష్‌ అన్నారు. భవిష్యత్‌లో రాబోయే సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోందన్నారు.

Related posts