ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై దాడిని ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. హోంమంత్రి అమిత్ షాది క్రిమినల్ ఇంటెలిజెన్స్ అని ఆరోపించారు.
సార్వత్రిక సమ్మెకు తెలంగాణ సీఎం కేసీఎర్ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీలో కాళ్లు మొక్కుతాడు.. ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతారంటూ విమర్శించారు. కార్మిక, ఉద్యోగ, కర్షక సంఘాల పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.
ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది