telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

డెబిట్ కార్డులు ర‌ద్దు చేయ‌నున్న‌ ఎస్‌బీఐ

rbi penalty to sbi about 7 crores

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) త్వరలో డెబిట్ కార్డుల‌ను రద్దు చేయనుంది.  డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రోత్స‌హించే నేప‌థ్యంలో ఎస్‌బీఐ డెబిట్ కార్డుల‌ను పూర్తిగా ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐలో ఎక్కువ శాతం క‌స్ట‌మ‌ర్లు డెబిట్ కార్డుల‌ను వినియోగిస్తున్నారు. తాము డెబిట్ కార్డుల‌ను సంపూర్ణంగా తొల‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు ఆ బ్యాంక్ చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్ తెలిపారు.

దేశంలో 90 కోట్ల డెబిట్ కార్డులున్నాయి. మ‌రో 3 కోట్ల క్రెడిట్ కార్డుల‌న్నాయ‌న్నారు. యోనో యాప్‌తో డెబిట్ కార్డుల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఎస్‌బీఐ భావిస్తున్న‌ది. యోనో ప్లాట్‌ఫామ్‌తో ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మెషీన్ల వ‌ద్ద క్యాష్‌ను డ్రా చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. ఏదైనా షాపు వ‌ద్ద కొనుగోలు చేయాలంటే కూడా యోనో ప్లాట్‌ఫామ్‌ను వాడే వీలు క‌ల్పిస్తారు. 

Related posts