telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ వచ్చిన సరే నిబంధనలు పాటించాలి…

corona vacccine covid-19

దాదాపు ఏడాదికి పైగా కరొనతో పోరాడిన తర్వాత మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే వ్యాక్సిన్ పంపిణి చేస్తున్న దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి.  కరోనా నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు.  మహారాష్ట్రలో ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించారు.  కొన్ని జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.  ప్రస్తుతం మనదేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.  రోజుకు 20 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయినప్పటికీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం అవగాహనా లోపం, నిర్లక్ష్యమే కారణం అని అంటున్నారు నిపుణులు.  వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించకుంటే కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అటువంటి జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కానీ ప్రజలు మాత్రం అలా చేయడం లేదు. చూడాలి మరి ఈ కేసులు మళ్ళీ ఎంతలా పెరుగుతాయి అనేది.

Related posts