telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రోడ్డు పైన కరోనా సోకినా వ్యక్తి హాల్ చల్…

ఇప్పటికే మన రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యను పెంచారు.  కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు.  కరోనా సోకిన వ్యక్తులకు ప్రభుత్వం హోమ్ క్వారంటైన్ లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె సంగారెడ్డి జిల్లాలోని కంగ్ది మండల కేంద్రానికి చెందిన నర్సింహా అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాడు.  అయితే, సడెన్ గా కరోనా సోకిన నర్సింహా రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాడు.  రోడ్డుపై తిరుగుతూ కనిపించాడు.  వైద్యులు ఆసుపత్రికి రమ్మని పిలిచినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే, పోలీసులను కూడా కరోనా సోకిన వ్యక్తి ముప్పుతిప్పలు పెట్టాడు.  పోలీసులు చుట్టుముట్టి లాఠీచార్జి చేస్తామని చెప్పడంతో సదరు వ్యక్తి లొంగిపోయాడు. అతడిని అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts