అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటననను ‘ఒక ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, నిరుద్యోగుల తరఫున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు నిర్వహించామని అన్నారు
లంగాణలో ఈరోజు ఈ ఫలాలు వస్తున్నాయంటే అది సోనియా, సోనియా, రాహుల్ గాంధీ పాత్ర కీలకమన్నారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ను పునఃప్రారంభించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను.
దీనికి సంబంధించి రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడుగుతాను’ అని జగ్గారెడ్డి తెలిపారు. హౌసింగ్ డిపార్ట్మెంట్‌ను రీ ఓపెన్ చేయాలని సీఎంను కోరతానని పేర్కొన్నారు.
పూటకోమాట చెప్పడమే కాంగ్రెస్ నాయకుల నైజం: ఎమ్మెల్సీ గుత్తా