telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుద‌ల‌..

తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన కొలువుల జాతర మొదలైంది.

గ్రూప్ 1 భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి. వీటిని ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష జులై లేదా ఆగస్టులో… మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ లేదా డిసెంబర్‌ నిర్వహించే అవకాశం ఉంది.గ్రూప్‌-1

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

*గ్రూప్‌-1లో 42 డిప్యూటీ కలెక్టర్‌, 91 డీఎస్పీ పోస్టులు

*గ్రూప్‌-1లో 121 ఎంపీడీవో పోస్టులు

*గ్రూప్‌-1లో 48 కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు

*గ్రూప్‌-1లో 26 అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు

*గ్రూప్‌-1లో 41 మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు

*గ్రూప్‌-1లో 38 అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టుల

*గ్రూప్‌-1 లో 40 అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు

*గ్రూప్‌-1లో 20 అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెజరర్‌ పోస్టులు

Related posts