ఈ నెల 13న హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.