telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” ఆంథెమ్ టీజర్… మూడు భాషల్లో ముగ్గురు క్రేజీ కామ్రేడ్స్

Dear-Comrade

“డియర్ కామ్రేడ్” సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్.. ట్రైలర్లు.. లిరికల్ సాంగ్స్ సినిమాపై ఇప్పటికే ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుండి కామ్రేడ్ ఆంథెమ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ కామ్రేడ్ ఆంథెమ్ పాటను జూలై 18 వ తేదీ గురువారం ఉదయం 11:11 గం.లకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ కామ్రేడ్ ఆంథెమ్ ప్రత్యేకత ఏంటంటే తెలుగులో విజయ్ దేవరకొండ పాడడం జరిగింది. తమిళంలో విజయ్ సేతుపతి.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఆలపించారు. ఇలా మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టార్లు ఇలా కామ్రేడ్ ఆంథెమ్ లో భాగం కావడం అందరినీ ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సౌత్ మార్కెట్ అంతా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరోలు ఇలా కామ్రేడ్ కోసం గొంతు సవరించడం అనేది విజయ్ అభిమానులకు ఫుల్ జోష్ ను ఇస్తోంది.

Related posts