telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

శ్రీలంక పేలుళ్లలో .. ఉపాధ్యాయుల పాత్ర..! వీరు పిల్లలకు ఏ పాటలు చెపుతారు.. !!

teachers involved in srilanka blasts

ఇటీవల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 106 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ స్కూలు ప్రిన్సిపాల్, తమిళ మీడియం టీచర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిని దంగేదరాలోని గల్లే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. టీచర్ నుంచి 50 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

కల్మునై నగరంలోని సైంథముర్తు ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల ఘటనలోనూ వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టడంతో వారు ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాత్రంతా భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. తప్పించుకునే మార్గం లేక ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.

Related posts