telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ సర్కారుపై పోరాటం

తెలంగాణ సర్కారుపై మావోయిస్టులు యుద్ధం ప్రకటించారు. రైతులకు న్యాయంజరిగేదాకా పోరాటాన్ని విశ్రమించవద్దని రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులపై మావోయిస్టులు లేఖలు విడుదలచేశారు. రైతుల సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ లేఖ విడుదల చేశారు. రైతులు పండించిన వరి పంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, యాసంగి పంటను వేయవద్దని నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రైతులు అందరూ ఏకంగా పోరాడాలని లేఖ ద్వారా పిలుపు నిచ్చారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తునపాయని మావోయిస్టులు పేర్కొన్నారు. రైతులకు వరి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని , వరి పంటను ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై నిర్వారామ పోరాటం చేయాలని రైతుల్ని కోరారు.

Related posts