telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అవాంతరాలు ఎదురైనా… ముందడుగే…

నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ లో అమరావతికోసం పాదయాత్ర సాగింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర 34వ రోజు సైదాపురం నుండి మొదలైంది. రైతులకు మద్దతుగా వెంకటగిరి మాజీ శాససభ్యుడు కురుగొండ రామకృష్ణ తో పాటు స్థానిక ప్రజలు భారీగా రైతుల పాదయాత్రకు మద్దత్తుగా కలిసొచ్చారు.

రైతుల పాదయాత్రలో సైదాపురం నుంచి తిప్పవరప్పాడు మీదుగా చెమిర్తి, పుట్టమరాజు కండ్రిగకు చేరుకుంది. పాదయాత్రకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు నియోజక వర్గం మాజీ శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ నేతృత్వంలో భారీగా టిడిపి పార్టీ శ్రేణులు, బహుజన సమాజ్ పార్టీ రాజకీయపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మద్దతుగా రైతుల పాదయాత్రకు మద్దతుగా కలసి నడిచారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద రైతులను ఘనంగా స్వాగతించారు.

డప్పుల వాద్యాలు, కళాకారుల నృత్యాలు, వీరతాళ్లతోపాటు జానపద కార్యక్రమాలతో పాదయాత్ర రైతుల్ని ఉత్తేజపరచారు. రైతుల యాత్రతో టిడిపి పార్టీకి నూతన ఉత్సాహం వచ్చినట్టు కన్పించింది. మహాపాదయాత్ర ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతున్ననేపథ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు.

కోవిడ్ నియమావళి పాటించలేదని, గుంపులు గుంపులుగా వెళ్లేందుకు వీళ్లేదని పాదయాత్రను నిలువరించారు. కొద్దిసేపు పాదయాత్ర కార్యకర్తలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. జై అమరావతి నినాదాలు హోరెత్తిస్తూ… సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగమల్లేశ్వరావును మంచి మనసుచేసుకుని పాదయాత్ర నిర్వహణకు సహకరించాలని కోరారు.

Related posts