నేడు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినం.
ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా నేతలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీశ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో హరీశ్ రావుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

