telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రగతి భవన్ లో గణపతి హోమం అందుకేనా ?

ఆదివారం నాడు హైదరాబాద్ లో గణనాధుని శోభా యాత్ర సందర్భగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు కుటుంబ సభ్యులతో కలసి శనివారం ప్రగతి భవన్ లో గణపతి హోమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం హిందువులంతా వినాయక నిమజ్జనం ఒక వూరేగింపు లా కాకుండా ఒక పండుగలా చేసుకుంటారు.

వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు . అయితే ఈ సంవత్సరం విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో కలిపి కలుషితం చెయ్యవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఈ సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చెయ్యడానికి అనుమతి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం తరుపున విన్న వించుకున్నా కోర్టు అంగీకరించలేదు . కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు .

CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు

గణేష్ నిమజ్జనం ప్రజల సెంటిమెంట్ తో ముడిపడింది . అందుకే ప్రభుత్వం ఆలస్యం చెయ్యకుండా ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది . సుప్రీం కోర్టు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించింది . దీంతో ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు పెద్ద రిలీఫ్ ఫీల్ అయ్యుంటారు . జటిలమైన సమస్య నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడింది . గణనాధుని భక్తులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు .అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శనివారం రోజు ప్రగతి భవన్ లో గణపతి హోమం నిర్వహించారు .

Related posts