telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

KCR cm telangana

ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం కేసీఆర్ ఆ భగవంతుడిని ప్రార్థించారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వేణు మాధవ్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భం‍గా తలసాని మాట్లాడుతూ తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేణు మాధవ్‌ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన కృష్టి పట్టుదలే కారణమన్నారు కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్‌కు కిడ్నీల్లో సమస్యలు రావడంతో ఆయనను ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు.

Related posts