నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని… మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్నారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమి కొనుగోలు చేస్తామని.. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని… ఒక్క సెంటర్ను కూడా మూసివేయడం లేదన్నారు. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యమని… పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారన్నారు. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుందని.. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు
							previous post
						
						
					
							next post
						
						
					


23 మంది ఎమ్మెల్యేలే అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదు: కోడెల