ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం 6 సూత్రాలతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. నవంబర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామన్నారు.
150 ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తారని జగన్ తెలిపారు. ఈ సమీక్షలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబరు 21న ఆరోగ్యశ్రీ కార్డులు జారీ కెఃయనున్నారు. కంటి వెలుగు పథకం కాలేజీలకు వర్తింపజేయనున్నారు. వైద్య సిబ్బంది బైకుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తారు.