చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు.
కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు
1) పార్వతీపురం మన్యం
2) అల్లూరి సీతారామరాజు
3) అనకాపల్లి
4) కాకినాడ
5) కోనసీమ
6) ఏలూరు
7) ఎన్టీఆర్
8) పల్నాడు
9) బాపట్ల
10) నంద్యాల
11) శ్రీసత్యసాయి
12) తిరుపతి
13) అన్నమయ్య



చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స