telugu navyamedia
క్రైమ్ వార్తలు

నూజివీడులో భారీ అగ్నిప్రమాదం..

విజ‌య‌వాడ : కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి.

విన్టేజ్ స్పిన్నర్స్ ప్రయివేట్ లిమిటెడ్ స్పిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మిల్లు మొత్తం పత్తితో నిండివుండటంతో మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో 5500 బ్లేడ్స్ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.30కోట్ల విలువైన ఆస్తి అగ్గికి ఆహుతయినట్లు స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం చెబుతోంది.

అగ్నిప్రమాదం జరిగిన స్పిన్నింగ్ మిల్లు జనావాసాల మధ్యలో వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుగానే మిల్లు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు.

సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండ్ లీక్ అవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts