ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2020లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు సీఎం జగన్. దేశంలోని ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని.. 2030 నాటికి దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతానికి పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని… 2023 నాటికి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. వీటి ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

