సీఎం జగన్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీస్లో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి అమెరికా వెళ్తున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఆయన కుటుంబంతో సహా అమెరికాలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా పర్యటనలో మిషిగన్- కోబో కన్వెన్షన్ సెంటర్లో ప్రవాసాంధ్రులతో జగన్ సమావేశం కానున్నారు.
మరోవైపు జగన్ ఆగస్టు 1వ తేదీన కుటుంబ సభ్యులతో కలసి జెరుసలేం పర్యటనకు వెళ్లనున్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జెరుసలేంలో పర్యటించి రాష్ట్రానికి తిరిగిరానున్నారు. సీఎం జగన్ వెంట భద్రతా అధికారులు ఎస్ఎస్జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి తదితరులు వెళ్లనున్నారు.



కోడెలను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు: అంబటి