ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్లనున్నారు.
శనివారం ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో దర్శికి బయలుదేరుతారు. అక్కడ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతారు.
10.45 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి బయల్దేరి వెళతారు. 10.50 గంటలకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.45 వరకు అక్కడే ఉండి.. 1.50 గంటలకు రోడ్డు మార్గంలో కాడ్రే సమావేశానికి బయలుదేరుతారు. అక్కడ ఒక గంట పాటు సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు తిరిగి దర్శి హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి, 3.35కు ఉండవల్లి చేరుకుంటారు.
ఇక, అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొంటారు.
అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లాలోని శాసనసభ్యులు అందరూ పాల్గొంటారు.

