సింగపూర్ అధికారులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ – SHDB, SARDA, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ తో సహా వరల్డ్ బ్యాంకు అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం – పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై సమావేశంలో చర్చ – ఏపీ అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై చర్చ – అమరావతి అనేది కొత్త ఆలోచనలు, ఆధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్త నగరమన్న సీఎం చంద్రబాబు – ఉత్తమ విధానాలతో కొత్త నగరం నిర్మిస్తున్నాం – అమరావతికి సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందన్న చంద్రబాబు – గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్-ఏపీ ప్రభుత్వాల మధ్య సమస్యలొచ్చాయన్న సీఎం – గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే సింగపూర్ వచ్చా – ఏపీ చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్ మెంట్ బోర్డును కోరిన సీఎం చంద్రబాబు