చెలి  చిరునవ్వుల
సోయగాలు 
వెదజల్లుతున్నాయి 
పూల సువాసనల
మధురిమలను 
ఆనందం పరిపక్వమవ్వడానికి 
విరిసే కుసుమాలు 
ఉసిగొల్పుతున్నాయి 
ప్రణయభావాల ఊసులు 
మొలకెత్తడానికి ఆశగా 
ఎదురు చూస్తున్నాయి 
అనురాగపు సిరులు 
అర్రులు సాస్తూ
ఆహ్వానిస్తున్నాయి
ఆకాంక్ష లు అక్షర బీజాల్ని 
అందిపుచ్చుకొని 
ప్రేమ లేఖల పర్వానికి 
తెరతీస్తున్నాయి…ఇక 
వెన్నెల పంట పండడానికి 
సిద్ధంగా ఉంది 
-పాపారావు, ముత్తనపల్లి



రోహిత్ శర్మను ఔట్ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా