ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. రామాంజనేయులు – రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇందులో ఆది పినిశెట్టి అథ్లెట్ గా కనిపిస్తున్నాడు. జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంటాడు.
అందుకోసం పట్టుదలతో కసరత్తు చేస్తూ కనిపించాడు. కానీ టీజర్ చివరిలో ఆయన రెండు కాళ్లను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా చూపించారు. ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో నాజర్, బ్రహ్మాజీ నటిస్తున్నారు. టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేయాలనే మేకర్స్ ప్రయత్నం ఫలించేలా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.
సినీ పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారు… దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు