మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరమని విమర్శించారు.
వైసీపీ సర్కారుపై కావాలనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ది అంటూ ఏమీ లేదన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్లే బదులు తిరోగమనం పట్టించేలా పయనించడం దుర్మార్గం అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ అధారంగా నిర్ణయం జరుగుతందన్నారు. ప్రభుత్వంలో బదిలీలు సాధారణమని, రాజకీయం చేయడం సరైంది కాదని అన్నారు.

