ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి నేడు  కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.  ఈ మధ్యాహ్నం రాయచూర్ లో నిర్వహించే సభలో రాహుల్, చంద్రబాబులు కలసి ఒకే వేదిక పై ప్రసంగిస్తారు. 
కర్ణాటకలో ఇప్పటికే చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కు మద్దతుగా మండ్య నియోజకవర్గం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నిఖిల్ పై దివంగత అంబరీష్ భార్య, సినీ నటి సుమలత పోటీ  చేస్తున్న సంగతి తెలిసిందే.



కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి