telugu navyamedia
విద్యా వార్తలు

CBSE 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌..

సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ కు సంబంధించి సోమవారం బోర్డ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు నవంబర్‌ 30 ప్రారంభమవుతుండగా, డిసెంబర్‌ 11న ముగియనున్నాయి. 12 వ తరగతి పరీక్షలు డిసెంబర్‌ ఒకటిన ప్రారంభమయ్యి 22 న ముగియనున్నాయి. సాధారణంగా పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది కానీ దృష్ట్యా పరీక్షలను పరీక్షలను గంట ఆలస్యంగా.. 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

cbse, cbse board exam date, cbse date sheet, cbse 10th exam date, cbse 12th exam date, cbse news, cbse exam datesheet, cbse timetable, cbse exams 2022

కాగా..కరోనా నేపథ్యంలో ఈ సారి బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఎస్‌ఈ పరీక్షలను రెండు భాగాలుగా విభజించింది. టర్మ్‌ 1 లో ప్రశ్నాపత్రం అబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. అయితే ఈ పరీక్ష పూర్తికాగానే కేవలం మార్కులను మాత్రమే ప్రకటిస్తారు.

రెండు టర్మ్‌లు పూర్తి అయిన తర్వాతే పాస్‌, ఫెయిల్‌కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌కు 50 శాతం మార్కులను కేటాయించారు.

Students after appearing for the CBSE board exam last year. (Sanchit Khanna/HT PHOTO)

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు వీలైనంత వరకు వారి సొంత పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ ఎస్‌ భరద్వాజ్‌ తెలిపారు.

ఇటీవ‌ల‌..సీబీఎస్ఈ పరీక్షల తేదీలు అధికారికంగా వెలువడకముందే సోషల్‌ మీడియాలో ఓ ‘నకిలీ షెడ్యూల్‌’ చక్కర్లు కొట్టింది. ఈ తప్పుడు వార్తలకు చెక్‌ పెడుతూ బోర్డ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని చెప్పింది. పరీక్ష తేదీలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని సూచించింది.

Related posts