స్థానిక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి గాను దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 9 వరకు ఉన్న దరఖాస్తు గడువును 15వ తేదీ వరకు పొడిగిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రాత పరీక్ష అక్టోబర్ 20న యధావిధిగా జరుగుతుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్‌కుమార్ కోరారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.knruhsrt.in ను సంప్రదించాలని ఆయన సూచించారు.