telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు

బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల గురించి నా ఆవేదన.. నా అభిప్రాయం.. అక్షర రూపం లో..

★ ఎన్నో ఉన్నత ఆశయాలతో, ఏదో సాధించాలి అనే సంకల్పంతో..
ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నా పాఠశాలను ఉన్నతమైన వ్యవస్థగా భావించి స్థాపిస్తారు..
★ ప్రభుత్వాలు చేయలేని, చేయని,చెయ్యాల్సిన పని అయిన ప్రాథమిక విద్యను,ప్రభుత్వం చేసే ఖర్చు కన్నా తక్కువలో అందించే సంస్థలు..
★ యువతకు ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యతను తమ భుజం పై వేసుకొని.. ప్రత్యక్షంగా వందల మందికి, పరోక్షంగా వేల మందికి, ఉపాధినిస్తూ….ప్రభుత్వం నుండి పైసా రాయతి పొందకుండా,ఎదురు కట్నం ఇచ్చి నిర్వహించే సంస్థ..
★ నాణ్యమైన విద్య అందించడం కోసం ఉన్న వనరులతో అను నిత్యం మార్పును ప్రవేశ పెట్టె సంస్థలు..
★ ఏ వ్యాపారానికి అయినా కొంత భాద్యతే ఉంటుంది..కానీ తమ యావత్తు సంసార జీవితాన్ని మరిచి పోయి,తమ పిల్లల బాగోగుల కన్నా,ప్రతి విద్యార్థిని తమ పిల్లలు గా భావించే సంస్థలు..
★ అసలు ఈ మధ్యతరగతి బడ్జెట్ ప్రైవేటు పాఠశాలలు లేక పోతే ★
1. భారత దేశంలో అక్షరాస్యత 78 శాతం దాకా రాగలదా..
2. ఎంతో మంది చదువుకున్న పట్టభద్రులకు ఉపాధి ఉండేదా..
3. పుస్తకాలు,పెన్నులు,బల్లలు అని వ్యవస్థలో ఇన్ని వ్యాపారాలు జరిగేవా
4. మన ఆర్థిక పరిస్థితి దేశ GDP అదుపులో ఉండేదా..
5. మనకి దగ్గర లోనే ఒక మారు మూల ప్రాంతములో ఇప్పుడు పొందుతున్న సౌకర్యాలతో పాఠశాలను,జీవిత కాలంలో చూసే వారమా…..
6. రాజకీయ నాయకులకు బస్సులు,రక రకాల వారికి చందాలు,పేపర్లకు,టీవీలకు,అడ్వర్టైజ్ లు వచ్చి ఇంత మందికి ఉపాధి వచ్చేదా..
7. ఎన్నో సంస్థలు,పాఠశాలల కోసం పనిచేసే సాంస్కృతిక,సంగీత, పాటల,ఆటల సంస్థలు,పుట్టుకొచ్చేవా, ఇన్నీ రంగాలలో ఉపాధి దొరికేదా..
8. బస్సులు,విహారాయాత్రలు, హోటల్స్ ఇలా చిన్న మరియు పేద్ద సంస్థలు మనుగడ సాదిస్తాయా….?
ఒక్క రామోజీ ఫిల్మ్ సిటీకి స్కూల్స్ ఇచ్చే డబ్బు 500 కోట్లు నమ్మగలరా.. వండర్ లా సంపాదన స్కూల్స్ మీద ఏడాదికి 250 కోట్లు……

Government High School A Smart School, Sector 50, Chandigarh: Admission,  Fee, Affiliation

★ మరి ఇంత చేసే బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల పై తల్లిదండ్రులు, మీడియా,జనాలు సమాజం…….!అభిప్రాయం ఇలా…..!★
1. మీరిచ్చే 20…..30 వేలు మొత్తం యాజమాని జేబులోకే పోతోంది అనే తప్పుడు ప్రచారం…….వాదన……,?
యదార్థానికి పెరిగిన ఖర్చులకు రెండు రూ..వడ్డీకి తెచ్చి నడిపిస్తున్న స్కూల్స్ ఎన్నో..
2. ఏదో దాన ధర్మం చేసినట్లు అడగంగా అడగంగా డబ్బులిస్తారు.. కానీ స్కూల్స్ మాత్రం సకాలంలో పరీక్షలు పెట్టాలి, ఆటలు, పాటలు అన్ని సకల సౌకర్యాలు ఇవ్వాలి,టీచర్లు మంచి వాళ్ళు కావాలి.. కానీ
డబ్బులు అడగకూడదు……అడిగితే….ఫీ….జూలూం……..? కార్టూన్ మరియు బ్యానర్ వార్త…..?
3. పత్రికలలో,రాజకీయాలలో మొదట కనబడేది స్కూల్స్,కానీ చిన్న తప్పు జరిగితే అవే నోళ్లు ఆ పాఠశాలను రోడ్డున పడేస్తాయి..
4. పుస్తకాలకు,డ్రెస్సులకు,టై,బేల్ట్ లకు ఏదో లాభాలు పోగేసారని బద్ నాం
కానీ ఉద్యోగం చేసే చోట మాత్రం ఎక్కువ అడుగుతారు….?
5. పిల్లాడు చదవక పోయినా, గాలికి తిరిగినా,రోడ్డు మీద పడ్డా, ఎవరితోనో పోయినా అన్నింటికి కారణం స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రుల బాధ్యత లేదు..
6. చదువు రాక పోతే ఒక దెబ్బయ్ అంటారు.. దెబ్బ వేస్తే మీడియా అంటారు.. పాము తో పాటు సమాజానికి రెండు నాలుకలు..
7. అసలు ప్రైవేటు పాఠశాల లతో పాటు సమానమైన భవనాలు ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉన్నాయి..
8. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులతో సరి సమానంగా ఎంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు..
9. ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఫైర్ సర్టిఫికెట్,టాయిలెట్స్,బిల్డింగ్ ఫిట్నెస్ ఉన్నాయి..

Shocking results of Telangana SSC examination: Zero pass percentage in 20  private schools- Edexlive

ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్న…..?నేను శంకిస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే ఒక సూటి ప్రశ్న……?
మీ ఉద్యోగాలలో కావచ్చు లేక అన్ని రంగాలలో మరియు సమాజములో మీరు మాకంటే నిజాయితీగా ఉన్నారా……అసలు ఉన్నారా……?గుండెమీద చెయ్యి వేసుకుని సమాధానం మీకు మీరే సమాధానం చెప్పుకోండి……మీ సమాధానం మాకోద్దు…..!

ప్రైవేటు పాఠశాలల యందు బడ్జెట్ పాఠశాలలు వేరయా..
విశ్వదాభిరామ వినురా,కనరా .. వేమా..
కార్పొరేట్ పాఠశాల ఫీజు 55 వేల నుండి 85 వేలు, ఇంటర్నేషనల్, స్కూల్స్ ఫీజు 75వేల నుండి 5 లక్షలు ఆ పైన
మరి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజు 10 వేల నుండి 30 వేలు.. మాత్రమే )
ఇంకా చాలా చెప్పొచ్చు…….కానీ ప్రస్తుతానికి ఇంతే…….
నమస్కారం..
యాదగిరి శెఖర్ రావు ,ట్రస్మ ,
రాష్ట్ర అధ్యక్షులు……..,🙏

Related posts