telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది.

గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది.

పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు.

అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.

Related posts