telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు హాస్యం

అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన.. పే ఛానల్ ప్రసారాలు..

new year celebrations application form fun corner

అన్ని వ్యాపారమే అంటూ.. ఇంటిలో టీవీలు చూసే వారిని కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వమంటూ .. ఇష్టానికి రేట్లు పెంచేస్తున్నారు. దానికి తోడు డిటిహెచ్ అంటూ ప్రవేశపెట్టి, అందరికి మంచి జరుగుతుంది అని చెప్పి, చివరికి నెలకు ఒకసారి రేట్లు పెంచి ఇష్టానుసారంగా బాదేస్తున్నారు. దానికి తోడు రోజుకోసారి ఆ టెక్నాలజీ అప్ గ్రేడ్, ఈ టెక్నాలజీ అప్ గ్రేడ్ అంటూ ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎప్పుడు టీవీప్రసారాలు ఆగిపోతాయా, ఆగిపోతే ఎవరిని అడగాలో తెలియని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ప్రసారాలు ఆపేస్తున్నాం అంటూ.. బెదిరింపులకు పాల్పడుతూ, ఇష్టానికి నెలవారీ చార్జీల నుండి అనేకానేక సమస్యలు సృష్టిస్తున్నారు. దీనిని ఎవరికి చెప్పుకోలేని, కాస్త హాస్యం జోడించి, ప్రజలు దీనిని తగినట్టుగా తీసుకోవాలని కోరుతున్నాం..

* దయ చేసి ఎవరు కూడా ఛానల్ activation కోసం ఎగబడవద్దు. వినియోగదారుడే రాజు అని చెప్తూ వాళ్ల చుట్టూ మనం తిరగడం ఏంటి?

– ఒక నెల చూడడం మానేస్తే TRP లు తగ్గి వాణిజ్య ప్రకటనలు ఎవరు చూడక వాళ్లే దారిలోకి వస్తారు.

– ఈ నెల మొత్తం మనం యూట్యూబ్ లో సినిమాలు చూద్దాం.

– రాత్రి పూట తొందరగా నిద్రపోదాం.

– కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుదాం.

– చెత్త సీరియల్స్ గోల లేకుండా హాయిగా ఉందాం 🙂 🙂

Related posts