telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బ్రేకింగ్ : హైదరాబాద్ లో భారీ పేలుడు కలకలం

fire in plastic factory dhaka 13 died

హైదరాబాద్ లో మరో భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని ఓ కెమికల్స్ డబ్బా పేలింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. రైల్వేస్టేషన్ కూతవేటు దూరం 31-బస్ స్టాప్ దగ్గర్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ ముందు పేలుడు సంభవించడంతో ఒకరి గాయాలు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్వాకాడ్..బాంబు స్వాకాడ్…డాగ్ స్వాకాడ్..పరిశీలిస్తున్నారు. చెత్త బండి నుండి చెత్త తీస్తుండగా కెమికల్స్ డబ్బా పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  నిజామాబాదు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల రాజుకు ఎడమ చేతికి గాయాలు అయ్యాయి.దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటూ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు..యధావిధిగా చెత్త ఏరుకునే సంచిలో డబ్బాలు తీసుకొచ్చి నేలకు వేసి కొట్టగా ఒక్కసారిగా కెమికల్ డబ్బాలు పేలాయి. దీంతో రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

Related posts