*పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త ..
*చికిత్స పొందుతూ మృతి చెందిన సాయి గణేష్ ..
*పోలీసులు వేధింపులే కారణమని బీజేపీ ఆరోపణ..
ఖమ్మం జిల్లాలోని పోలీసుల వేధింపులకు యువకుడు బలయ్యాడు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వివరాల్లోకి వెళితే..
సాయి గణేష్ అనే యువకుడు బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయిగణేష్ మనస్థాపానికి గురై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడే పురుగు మందు సేవించాడు.
వెంటనే పోలీసులు అతనిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా సాయిగణేష్ ఆత్మహత్యకు కారణం పోలీసులు వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది. సాయి గణేష్ ఆత్మహత్యకు యత్నించడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ప్రదర్శనగా ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు.