ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై సమామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లోని లాల్ బంగ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే మన అన్నయ్య స్నేహితులు అంటే అన్నయ్యగానే చూస్తాం. కానీ కాన్పూర్‌లో వారే అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్నేహితుడి చెల్లేలని కూడా లేకుండా నలుగురు స్నేహితులు కలిసి ఒక మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయికి ఏదో తాపించి వారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వెంటనే నలుగురిలో ఇద్దరును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పరారీలో ఉన్న వారి కుటుంబాలను విచారణా నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును పలు సెక్సన్‌లలో నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సిక్షన్స్ 328, 342, 363, 376 (డీ) లతో పాటు పీఓసీఎస్ఓ యాక్ట్‌ను కూడా నమోదు చేవారు. ఈ వివరాలను కాన్పూర్ ఎస్‌పీ రాజ్ కుమార తెలిపారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.
previous post
next post
జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: యనమల