telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నారా భువనేశ్వరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా, చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

తన జీవితంలోనూ, కుటుంబంలోనూ భువనేశ్వరి పాత్రను కొనియాడుతూ ఆయన చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

“పుట్టినరోజు శుభాకాంక్షలు భువనేశ్వరి! నీ ప్రేమ, బలం మన కుటుంబానికి పునాది వంటివి. జీవితంలోని ప్రతి ఒడిదుడుకులోనూ నా పక్కనే నిలిచావు.

జీవితంలో నా భాగస్వామిగా మిమ్మల్ని పొందినందుకు నేను నిజంగా కృతజ్ఞుడను” అంటూ చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

భువనేశ్వరిలోని దయాగుణం, ప్రజల పట్ల ఆమెకున్న శ్రద్ధ ప్రశంసనీయమని సీఎం తెలిపారు.

వ్యాపార రంగంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ప్రదర్శిస్తున్న హృదయపూర్వక నాయకత్వ పటిమ తమ అందరికీ స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు కొనియాడారు.

Related posts