చైనా నుంచి వచ్చిన కరోనా ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ప్రస్తతం అనేక దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టీకాలు రెడీ అవుతున్నాయి. అయితే, టీకాలు ఎంత వరకు మహమ్మారిని అడ్డుకోగలదో తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. పూర్తిస్థాయిలో కరోనా మహమ్మారిని అడ్డుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. నిబంధనలు పాటించడం మినహా మరొక ఆప్షన్ లేదు. ఇక కరోనా మహమ్మారి విజృంభణ, తీవ్రతపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళనను వ్యక్తం చేశారు. రాబోయే 4 నుంచి 6 నెలల కాలంలో కరోనా వైరస్ మరింత విజృంభించి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడొచ్చని బిల్ గేట్స్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా అమెరికాలో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో అయన ఈ వ్యాఖ్యలు చేశారు. భయాలు పోగొట్టి మహమ్మారిపై పోరాటం చేసేందుకు తానుకూడా బహిరంగంగానే టీకాను తీసుకుంటానని అన్నారు బిల్ గేట్స్. చూడాలి మరి ఈ వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు అనేది.
previous post

