telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డేవిడ్‌ వార్నర్‌ తో ప్రమాదమే.. : బెన్‌ స్టోక్స్‌

stocks comments on warner for ashes series

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. వార్నర్‌, స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌ రాకతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ విభాగానికి బలం చేకూరింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌కు వార్నర్‌ కచ్చితంగా కీలకమైన ఆటగాడే. తన అసాధారణమైన బ్యాటింగ్‌తో సులభంగా మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. ఇలాంటి ప్రమాదకర ఓపెనర్‌ను ఆరంభంలోనే కట్టడి చేస్తేనే సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించవచ్చు.. అని స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

గురువారం నుంచి ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. తొలి రోజు నుంచే పర్యటక జట్టును ఒత్తిడిలోకి నెడితేనే సిరీస్‌పై తమ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని స్టోక్స్‌ అభిప్రాయపడ్డాడు. ఏ జట్టుకైనా తొలి రోజే మంచి ఆరంభం దొరికితే అదే సానుకూల వాతావరణాన్ని మిగతా నాలుగు రోజుల ఆటపైనా కొనసాగించవచ్చునని ఈ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు.

Related posts