వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి రోజు 16 మంది కంటెస్టెంట్స్ పరిచయంతో సెప్టెంబర్ 6 ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 9 వరకూ సాగింది. అయితే అందులో చాలామంది గురించి ప్రేక్షకులకు అసలు తెలియదనే చెప్పాలి. అందుకే వీళ్ళు ఎవరు అని గూగుల్లో గాలిస్తున్నారు ప్రేక్షకులు. వారిలో దర్శకుడు సూర్యకిరణ్ ఒకరు. అప్పట్లో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన సూర్యకిరణ్. ఆ తర్వాత రచయితగా దర్శకుడిగా మారారు. సత్యం, ధన 51, రాజుభాయ్ సినిమాలను తెరకెక్కించారు. అంతే కాకుండా సూర్యకిరణ్ భార్య ప్రముఖ హీరోయిన్. నిన్నటితరం హీరోయిన్ కల్యాణిని సూర్యకిరణ్ వివాహం చేసుకున్నారు. కళ్యాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కళ్యాణి. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో కూడా ఆమె నటించింది. పెళ్ళైన కొంతకాలానికి మనస్పర్థలు రావడంతో సూర్య కిరణ్ కళ్యాణి విడాకులు తీసుకున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					


“ఛీఛీ… నేను మాట్లాడటమేంటి?…” నాగబాబు కామెంట్స్ పై బాలయ్య రియాక్షన్