telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయూ అరెస్ట్‌..

బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే యూట్యూబర్‌, బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ  సరయూను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు.

సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌ కోసం గతేడాది నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ లఘుచిత్రం.. హిందూ సమాజాన్ని, మహిళలను కించపర్చే విధంగా ఉందంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్‌ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

అయితే.. ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహీల్స్‌ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.

ఆమెతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరయూతోపాటు ఆమె టీమ్‌లో ఉన్న దర్శక నిర్మాత, శ్రీకాంత్‌ రెడ్డి, నటులు కార్తీక్, కృష్ణ మోహన్‌లను కూడా అరెస్ట్‌ చేశారు. వారిని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి నోటీసులు జారీ చేశారు. మంగళవారం వీరిని మరోసారి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Related posts