భీమవరం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న ఎమ్మెల్యే గ్రంథిపై పవన్ ఫైర్ కాగా.. తాజాగా జనసేనానికే కౌంటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే గ్రంథి. పవన్ కళ్యాణ్ ఓ స్టేట్ రౌడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. జనసైనికులు ఆకు రౌడీలు అంటూ నిప్పులు చెరిగారు. అవగాహనా లోపంతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన గ్రంథి శ్రీనివాస్.. ఆయన ఓ మానసిక రోగి అంటూ మండిపడ్డారు. ఇక, మీరు తలలు నరికితే నరికించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తనను పిచ్చికుక్కల వ్యాన్లో వేసి పంపుతామన్నారని.. మరీ.. గత ఎన్నికల్లో రెండు చోట్ల అదే వ్యాన్లో ప్రజలు మిమ్మల్ని వేసి పంపించారు మరిచిపోవద్దంటూ కౌంటర్ వేశారు ఎమ్మెల్యే గ్రంథి.
previous post


రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా