*తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె
*ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసిన సీతా మహాలక్ష్మి..
*బూర్గంపాడు మండలం సారపాక లో ఈ ఘటన జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి సీతా మహాలక్ష్మి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున ఆత్మహత్య పాల్పడినట్లుగా తెలుస్తోంది.
మృతురాలు సీతా మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతుంది. బూర్గంపాడు మండలం సారపాక లో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలుతో మనస్థాపం చెంది సీతా మహాలక్ష్మి ఆత్మహత్య పాల్పడిందని తెలుస్తోంది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీ నేతలు, కార్యకర్తలు వెంకటేశ్వర్‌రావు ఇంటికి చేరుకుంటున్నారు. మహాలక్ష్మి మృతితో వెంకటేశ్వర్ రావు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

