telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్ లోకి మూడు కొత్త నియమాలను తీసుకొచ్చిన ఆసీస్…

బిగ్ బాష్ లీగ్ పదవ సీజన్ డిసెంబర్ 10న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే తాజాగా ఈ లీగ్ లో పవర్ సర్జ్, ఎక్స్-ఫాక్టర్ ప్లేయర్ మరియు ‘బాష్ బూస్ట్’ అనే మూడు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది బోర్డు. అయితే ఈ కొత్త నిబంధనలనకు కొంత మంది మద్దతు ఇస్తుంటే… మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ కొత్త నియమాలు ఏంటి అనేది చూద్దాం…

పవర్ సర్జ్ : మాములుగా టీ 20 ఫార్మాట్ లో మొదటి ఆరు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. కానీ ఈ నిబంధన ప్రకారం మొదటి నాలుగు ఓవర్లు మాత్రమే పవర్ ప్లే ఉంటుంది. ఆ మిగిలిన రెండు పవర్ ప్లే ఓవర్లను 10-20 ఓవర్ల మధ్యలో బ్యాటింగ్ టీం ఎప్పుడైనా ఎంచుకోవచ్చు. 
ఎక్స్-ఫాక్టర్ ప్లేయర్ : ఈ నిబంధనలో రెండు జట్లు తుది జట్టులో 11 మంది ఆటగాళ్లను మాత్రమే కాకుండా  12,13 వ ఆటగాళ్లను కూడా ప్రకటించాలి. ఆ తర్వాత జట్లు మొదటి 10 ఓవర్లలో ఎవరినైనా జట్టు నుండి తప్పించి ఈ ఇద్దరిలో ఎవరినైనా జట్టులోకి తీసుకోవచ్చు. అయితే ఎవరి స్థానంలో వీరిని తీసుకుంటున్నారో వారు అప్పటివరకు బ్యాటింగ్ చేయకూడదు. బౌలింగ్ టీం అయితే ఆ ఆటగాడు ఒక ఓవర్ కంటే ఎక్కువగా బౌలింగ్ చేయకూడదు.
బాష్ బూస్ట్ : మ్యాచ్ యొక్క తొలి 10 ఓవర్లలో ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారికి ఈ నిబంధన ఒక పాయింట్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ రెండు జట్లు సమానంగా పరుగులు చేస్తే ఇద్దరికి అర అర పాయింట్ వస్తుంది.

Related posts