telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రిమాండ్‌లో బండ్ల గ‌ణేష్‌… నవంబ‌ర్ 4 వ‌ర‌కు…!

Bandla-Ganesh

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను రిమాండ్ కు తరలించనున్నారు. ఏపీలోని కడపకు చెందిన మహేశ్‌తో వ్యాపార లావాదేవీలు కలిగిన బండ్ల గణేశ్.. 2014లో ఆయనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. ఈ మొత్తానికి సంబంధించి మూడు చెక్కులను బండ్ల గణేశ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాం కుకు చెందిన ఈ చెక్కులను 2017లో కడపలోని హెచ్‌డీఎఫ్ బ్యాంకులో మహేశ్ వేశారు. అప్పటికే ఈ చెక్కులను స్టాప్ పేమెం ట్ చేయించిన గణేశ్.. మహేశ్‌కు డబ్బులు ఇవ్వలేదు. దీంతో కడపలో కేసు నమోదైంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కొద్ది సేప‌టి క్రితం క‌డ‌ప కోర్టుకి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం బండ్ల గ‌ణేష్‌ని నవంబ‌ర్ 4 వ‌ర‌కు రిమాండ్‌లో ఉంచాల‌ని ఆదేశించింది. దీంతో క‌డ‌ప పోలీసులు బండ్ల గ‌ణేష్‌ని కేంద్ర కారాగారానికి త‌ర‌లించ‌నున్నారు.

Related posts