telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన అట్లీ

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో యంగ్ టైగర్ ఎన్టీయార్ కలిసి పనిచేయబోతున్నట్టు ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి అటు ఎన్టీయార్‌కాని, ఇటు అట్లీకాని అధికారికంగా స్పందించలేదు. అట్లీ తాజాగా రూపొందించిన చిత్రం `బిగిల్`. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ చిత్రం తెలుగులో `విజిల్` పేరుతో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన అట్లీ.. ఎన్టీయార్ సినిమా గురించి స్పందించాడు. “తెలుగు సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఆతృతగా ఎదురుచూస్తున్నా. తమిళంలో నేను చేసిన ప్రతీ సినిమా విడుదల సమయంలో ఎన్టీయార్ నాకు ఫోన్ చేసి అభినందిస్తారు. ఆయనది చాలా మంచి మనసు. ఆయన కోసమైనా తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నాను” అని అట్లీ అన్నాడు.

Related posts