telugu navyamedia
సినిమా వార్తలు

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుండి తప్పుకున్న ‘బండ్ల గణేశ్’

‘మా’ ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. అద్యక్ష పదవికి పోటీ చేస్తారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ .. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరాడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత బండ్ల గణేశ్‌.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించి షాక్‌కు గురి చేశారు. తనను వారి ప్యానెల్ అధికార ప్రతినిధిగా ఎన్నుకొన్నందుకు కృతజ్ఞతలని, కానీ, తన వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతను నిర్వహించలేనని చెప్పారు. ఆ పదవికి వేరొకరిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొంటూ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆయన మరో ట్వీట్‌ చేశారు.

‘‘మనస్సాక్షికి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. పోటీ చెయ్ అంటోంది. అందుకే పోటీ చేస్తున్నాను. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. ఎవరి మాటా వినను. అందరికీ ఎన్నో అవకాశాలను ఇచ్చారు. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మాట తప్పను.. మడమ తిప్పను. నాది ఒకటే మాట.. ఒకటే బాట. నమ్మడం.. నన్ను నమ్మిన వారి కోసం బతకడం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related posts