telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రాక్‌ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ ?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్ ‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  అయితే తాజాగా బాలయ్య కొత్త సినిమా గురించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ దర్శకత్వంలో నటించడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బాలయ్య మూవీ కూడా ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తన దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయని… ఇంకా ఫైనల్‌ కాలేదని స్వయంగా గోపీచంద్‌ క్లారిటీ ఇచ్చారు. అన్ని కుదిరితే గోపీచంద్‌ దర్శకత్వంలో బాలకృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ రూపొందే అవకాశం ఉంది. మాస్‌ మూవీస్‌ దర్శకుడు గోపీచంద్‌, పవర్‌ ఫుల్‌ హీరో బాలయ్య కాంబోలో మూవీ అంటే ఇక ఫ్యాన్స్‌లో పండగే అంటున్నారు సినీ ప్రముఖులు. 

Related posts