telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

100 రోజులు పూర్తి చేసుకున్న “ఇస్మార్ట్ శంకర్”

Ismart-shankar

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ రామ్ కెరీర్‌లో తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. నేటితో ఈ చిత్రం సెంచ‌రీ కొట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద సక్సెస్‌ఫుల్‌గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ వంద రోజుల పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. పూరీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సెప్టెంబ‌ర్ 27, 28, 29 తేదీల‌లో చిత్రాన్ని ప‌ది థియేట‌ర్స్‌లో రీ రిలీజ్ చేయ‌గా, అప్పుడు కూడా చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింద‌నే లభించింది.

Related posts