telugu navyamedia
సినిమా వార్తలు

మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడేనా!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వచ్చాయి. బోయపాటి శ్రీనుతో మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేయబోతున్నారని.. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అప్పట్లో టాక్ నడిచింది. ఇందులో ఏదీ నిజం కాలేదు. మోక్షజ్ఞ ఇప్పటి వరకు తెరంగేట్రం చేయనప్పటికీ నందమూరి అభిమానులు అతనిపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. బాలయ్య తనయుడి పుట్టినరోజు వచ్చిందంటే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తుంటారు.

ఈరోజు (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో కామన్ డీపీతో సోషల్ మీడియాలో హంగామా చేశారు. హిందూపూర్ లో మోక్షజ్ఞ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ శాతం సామూహిక వేడుకలకు దూరంగా ఉన్న ఫ్యాన్స్.. ఈసారి మోక్షజ్ఞ దగ్గరకే వెళ్ళి సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం నందమూరి అభిమానులు మోక్షజ్ఞతో కేక్ కట్ చేయించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తల్లి వసుంధర సమక్షంలో జరిగిన ఈ బర్త్ డే వేడుకలు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అంతేకాదు ఇందులో మోక్షజ్ఞ లుక్ చూసి త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించి సినిమాలపై అతనికి పెద్దగా ఆసక్తి లేదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ తన లుక్ ని కంప్లీట్ గా మార్చేశాడు. భారీ వర్కౌట్స్ చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని అభిమానులు అంటున్నారు. బాలయ్య సైతం మోక్షజ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేస్తున్నారు. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్నీ కుదిరినప్పుడు లాంచింగ్ ఉంటుందని గతేడాది బాలయ్య పుట్టినరోజు నాడు చెప్పారు. ఈసారి బర్త్ డే సందర్భంగా ‘ఆదిత్య 369’ కు సీక్వెల్ గా రాబోయే ‘ఆదిత్య 999 మాక్స్’ సినిమా ద్వారా తనయుడి తెరంగేట్రం ఉంటుందని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు.

Related posts