కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది అనేది మరోసారి రుజువైంది. బాహుబలికోసం జక్కన టీం పడ్డ కష్టం ఎంత ఫలితాన్ని ఇచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదేచిత్రానికి మరో ఘనత దక్కబోతోంది. రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాన్-ఇంగ్లీష్ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్’ కావడం చాలా సంతోషంగా ఉందని ఎస్.ఎస్. రాజమౌళి అన్నారు. ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. 2015 జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించారు. సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ స్కోర్‌ను అక్టోబరు 19న రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబోతున్నారు.
అక్టోబర్ 19న ప్రపంచంలోనే ఫేమస్ అయిన లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి’ సినిమా స్కోర్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించబోతుండటం చాలా ఉత్సుకతగా ఉంది. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. మొట్టమొదటిసారి ఈ హాల్లో ప్రదర్శించబోతున్న నాన్-ఇంగ్లీష్ ఫిల్మ్ మా ‘బాహుబలి: ది బిగినింగ్’ కావడం చాలా సంతోషంగా ఉందని జక్కన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో ‘బాహుబలి’ చిత్ర బృందం పాల్గొనబోతోంది.


కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్